calender_icon.png 26 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరెడ్‌మెట్‌లో మహిళ అదృశ్యం

24-07-2025 01:05:42 AM

మల్కాజిగిరి, జులై 23(విజయక్రాంతి) : నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్ నేరేడ్మెట్కు చెందిన నాగటి లక్ష్మి(55) అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళా మానసిక స్థితి  సరిగా లేని కారణంగా, ఈ నెల 16వ తేదీన ఆమె కుమారుడు శివకుమార్ ఇంటి దగ్గరలోని చర్చి వద్దకు తీసుకెళ్లి అక్కడే ఉంచాడు.

అయితే, జూలై 18వ తేదీ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో లక్ష్మి ఎవరికీ చెప్పకుండా చర్చి నుండి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఇంటికి తిరిగిరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు ఇచ్చినా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.