07-11-2025 12:38:41 AM
మంత్రి తుమ్మల నాగేశ్వరావు
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): గత వ్యవసాయ సీజన్ ప్రారంభం కాకుముందే ఎరువులు అడిగినా కేంద్రం ఇవ్వలేదని, ఈ సీజన్‌లోనైనా కేటాయించిన ఎరువుల్లో 60 నుంచి 70 శాతం వరకు నవంబర్, డిసెంబర్ వరకు సరఫరా చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నా రు. యాసంగి సీజన్‌కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై మంత్రి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అక్టోబర్, నవ ంబర్ వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా కేటాయించిందని తెలిపారు. ఈ నెలలో ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పా రు. ప్రస్తుతం రాష్ర్టంలో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 58 వేల టన్నుల డీఏపీ, 2.09 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.