07-11-2025 12:36:52 AM
క్రీడా పోటీలను ప్రారంభించిన ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్న కలెక్టర్
గోపాలపేట, నవంబర్ 6: క్రీడాకారులు ఓటమిని ఓ పాఠంలో తీసుకొని సాధన చేసి విజయం సాధించాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండలం బుద్ధారం గ్రామం గండి సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మార్కెట్ కమిటీ జిల్లా చైర్మన్ మార్కెట్ కమిటీ శ్రీనివాస్ గౌడ్ జిల్లా పరిషత్ మాజీచైర్మన్ మాజీ లోక్నాథ్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజల చేశారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడారు. వనపర్తి జిల్లా వనాల పర్తి కాదు ఆటలపర్తి అని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 7న భారత స్వాతంత్రపు జనగణమన ప్రతి ఒక్కరూ ఆలపించాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో విశ్వవిద్యాలయ గ్రంథాలయ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తాసిల్దార్ తిలక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.