calender_icon.png 17 September, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు

17-09-2025 02:29:26 AM

  1. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేయొద్ద్దు 

ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం

గ్రూప్ 1 క్వాలిఫైడ్ అభ్యర్థుల తల్లిదండ్రులు 

ఖైరతాబాద్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి) : గ్రూప్ ౧ పరీక్షల వివాదాన్ని రాజకీ యం చేసి  అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగా టం ఆడవద్దు అని గ్రూప్ 1 క్వాలిఫైడ్ అభ్యర్థుల తల్లిదండ్రులు వేడుకున్నారు. ఈనెల 9న గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, ఫలితా లలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కొందరు, రద్దు చేయ్యదం టూ మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. 222 పేజీల తీర్పును వెలువరించింది.

ఈ నేపథ్యంలోమంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అధ్య ర్థుల తల్లిదండ్రులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అభ్యర్థుల తల్లిదండ్రులు జంగారెడ్డి, లలిత, ఆనం ద్ కుమార్, సీతా, పావని, సోనియా తదితరులు హాజరై మాట్లాడారు.. ఎంతో కృషి పట్టుదలతో మెరిట్ ర్యాంకులు సాధిస్తే రూ. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు అసత్య ఆరోపణలతో మనో వేద నకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు.

రోపణలు చేసేవారు వాటిని ఆధారాలతో నిరూపించాలాంటు వ్యాఖ్యా నించా రు. అప్పులు చేసి, ఓ పూట తిని, ఓ పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా పిల్లలను  ఎన్నో కష్టాలు పడి, త్యాగాలు చేసి చదివిస్తే, రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.3 కోట్లు కాదు.. రూ.30లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూడలేదు.

రాత్రీపగలు తేడా లేకుం డా కష్టపడి కూలి పనులు చేసుకుంటూ చదివించాం అని తెలిపారు. మీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని అన్ని పార్టీల నాయకులను  వేడుకున్నారు. పోస్టులు కొనుక్కున్నా మన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మా పిల్లలు ఎంతో కష్టపడి గ్రూప్-1 ర్యాంక్ సాధించారని హై కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది అని తెలిపారు.

మూడు కోట్లు కాదు 30 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు 

ఎంతో కృషి పట్టుదలతో ర్యాంక్ సాధిస్తే.. కొంతమంది స్వార్థపరులు గ్రూప్-1ను రాజకీయం చేస్తున్నారని 67వ ర్యాంకర్ తల్లి లలిత ఆవేదన వ్యక్తం చేసింది. 30 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేని తాము మూడు కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటామని ప్రశ్నించారు. ఏదన్నా ఉంటే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు.

 లలిత, 67వ ర్యాంకర్ తల్లి

రూ.3 కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటాను? 

భర్త చనిపోతే ఓ పాఠశాలలో 10 వేల రూపాయల జీతానికి పనిచేస్తున్న మూడు కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటానని 366వ ర్యాంకు సాధించిన విద్యార్థి తల్లి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. 

 ర్యాంకర్ తల్లి