17-09-2025 02:09:56 AM
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
తిమ్మాపూర్, సెప్టెంబరు 16 (విజయ క్రాంతి): ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేప ట్టాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీరాజ్ అధికారులు ఆదేశించారు. మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో మానకొండూర్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి తోపాటు వివిధ అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఆ యన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవల కురిసిన వర్షాలు,వరదల వల్ల మానకొండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల గురించి ఎమ్మెల్యే అధికారుల నుంచి ఆరా తీశారు. మండలాల వారీ గా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయ తీరాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ రహమాన్, డెప్యూటీ ఈఈలు మంజులాభార్గవి, రవి ప్రసాద్, ఏఈలు సురేందర్ రెడ్డి, ప్రవీణ్, మల్లేశం, వెంకటేశ్వర్లు, తదితరులుపాల్గొన్నారు.