12-10-2025 03:46:02 AM
కరీంనగర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను ఆపేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను ఆపొ ద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను మరింతగా విస్తరిస్తూ ప్రజలకు సేవలం దించేలా చూడాలని కోరుతానని చెప్పారు. శనివారం కేంద్రం, జపాన్ ఇంటర్నేషనల్ సంస్థ జికా ఆర్థిక సహకారంతో రూ.90.70 కోట్లతో కరీంనగర్‌లో నిర్మించిన ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్‌ను బండి సంజయ్ ప్రారం భించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సంజయ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతు ల పక్షపాతి అని కొనియాడారు. దేశంలోని 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏటా రూ.24 వేల కోట్ల నిధులతో ధన్ ధాన్య కృషి యోజన శనివారం నుంచి అమలు చేస్తుండటం శుభ పరిణామమన్నారు. కాగా కరీంనగర్ డెయిరీని రాజేశ్వర్‌రావు కష్టపడి ఈ స్థాయికి తీసు కురావడంవల్లే ఆయనకు ఆ పేరు వచ్చిందని చెప్పారు. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (2012లో)ను ఏర్పాటు చేసి, ఇప్పుడు ప్రతిరోజు 2 లక్షల లీటర్ల పాలను సేకరించడంతోపాటు 40 లక్షల లీటర్ల పెరుగును విక్రయించడం మామూలు విషయం కాదన్నారు.
600 మందికి ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడంతోపాటు లక్ష మంది పాడి రైతుల నుంచి పాలను కొనుగోలు చేసి వారి జీవితాలకు భరోసా ఇస్తున్న సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఇవన్నీ గమనించిన మోదీ ప్రభుత్వం ఇలాంటి సంస్థలకు అండగా ఉంటుందని కరీంనగర్ డెయిరీ పనితీరును చూసి మోదీ ప్రభుత్వం 2021లోనే 3 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సాయం అందించిందని చెప్పారు. ప్రధాన మంత్రి ధన-ధాన్య కృషి యోజనలో భాగంగా జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ సహకారంతో రూ.90.70 కోట్ల వ్యయంతో లక్షా 50 వేల లీటర్ల పెరుగు కేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు.