31-10-2025 12:21:38 AM
-పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, భక్తులు
-స్వామి అభిషేక్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో అలంపూర్‌లో నిర్వహణ
హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి):తెలంగాణలోని అలంపూర్‌లోని మాతా జోగులాంబ శక్తిపీఠంలో స్వామి అభిషేక్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో శ్రీవిద్యా కుంకు మార్చన మహా యజ్ఞం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సుమారు ఐదువేల మంది మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు కంకుమార్చనలో పాల్గొన్నారు. కోటి లలితా సహస్ర నామ మంత్రాలను ఈ సందర్భంగా పాల్గొన్నవారు జపించారు.
ఈ సందర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి దేశం పురోగతి, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం లలిత అమ్మవారిని ప్రార్థించారు. సనాతన ధర్మం అందరినీ కలుపుకొని పోతుందన్నారు. యు వచేతన జాతీయ కన్వీనర్ రోహిత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశా న్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. లలితా మాత ఆశీస్సులు, ప్రజల కృషితో దేశ ప్రతిష్టలు పెరుగుతాయన్నారు.