calender_icon.png 31 October, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ ప్రారంభం

31-10-2025 12:23:34 AM

హైదరాబాద్, అక్టోబర్ 30: గోల్ఫ్ ఇం డస్ట్రీ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ 2025 గచ్చిబౌలీలోలి బౌల్డర్‌హిల్స్ గోల్ఫ్ క్లబ్‌లో ఉత్సాహంగా ప్రారంభమైంది.రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్ ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. గోల్ఫ్ టర్ఫ్ నిర్వహణకు సంబంధించి పలు కార్పొరేట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేయడం, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై చర్చ జరిగింది. పలు కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, గోల్ఫర్లతో పాటు పీజీటీఐకి చెందిన ప్రముఖులు గోల్ఫ్ క్రీడను అభివృద్ధి చేయడంపై విలువైన సలహాలు ఇచ్చారు.అంతర్జాతీయ ప్రమాణాల తో గోల్ఫ్ కోర్సుల నిర్మాణంపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.వచ్చే ఒలింపి క్స్‌లో భారత్‌కు గోల్ఫ్‌లో మెడల్ వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.