calender_icon.png 26 January, 2026 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైట్ తీసుకోకండి!

03-01-2025 12:00:00 AM

ప్రేమికులు, దంపతుల మధ్యలో ఒక్కొసారి గొడవలు, భేదాభిప్రాయాలు సహజమే. అయితే, ఇలాంటి గొడవలు తరచూ జరుగుతున్నా, మీ భాగస్వామి మాటలు మీపై తీవ్ర ప్రభావం చూపుతున్నా అప్రమత్తం కావాలంటున్నారు నిపుణులు. పైకి ప్రేమగానే ఉన్నట్లు కనిపించినా అది మీకు ఇబ్బందిగా మారొద్దు. ఒక బంధంలో ఎదుటివారికి గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం.

కానీ మాటలతో, చేతలతో అవతలివారి ఆత్మస్థుర్యైన్ని తగ్గించడం చాలామంది చేస్తుంటారు. దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. వివరంగా చెప్పాలంటే.. ‘గ్యాస్ లైటింగ్’ అనేది భావోద్వేగ దుర్వినియోగానికి సంబంధించిన ఒక రూపం. అబ్యూజర్ తీరు బాధితుల్లో అవగాహన, వాస్తవికత, జ్ఞాపకశక్తి గురించి తనకు తానుగా ప్రశ్నించుకునే స్థితికి దిగజారుస్తుంది. చిన్నచిన్న ఇన్సిడెంట్స్‌తో ప్రారంభమయ్యే ఈ ఇన్‌ఫ్లుయెన్స్.. కాలక్రమేణా బాధితుల్లో అపారమైన స్వీయ సందేహం, ఆందోళన, అయోమయానికి దారి తీస్తుంది. మానసికంగా మాత్రమే కాదు శారీరకంగానూ ప్రభావితం చేస్తుంది.