calender_icon.png 13 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోళన పడకండి

13-10-2025 01:39:40 AM

  1. బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది
  2. విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లాం
  3. మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి
  4. జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులకు మాజీ మంత్రి హరీశ్‌రావు భరోసా

హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మి కులు ఆందోళన పడొద్దని, బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు వారికి భరోసా ఇచ్చారు. ‘మీ సమస్య లను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లాం. మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందు కు అన్ని విధాలా కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో హ రీష్‌రావు ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు.

మీ ఇబ్బందులు తమ దృష్టికి వచ్చిన వెంట నే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్‌రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఏడా ది క్రితం ఉపాధి కోసం వెళ్లి న 12 మంది వలస కార్మికులు జోర్డాన్‌లో చిక్కుకున్నారు.

నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన కార్మికులు దేశం కాని దేశంలో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబాల వద్దకు చేర్చాలని హరీశ్‌రావుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పం దించిన హరీశ్‌రావు వారితో ఫోన్‌లో మా ట్లాడి, ధైర్యం చెప్పారు.