07-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా దోస్త్ హెల్ప్‌డెస్క్ నెంబర్ 040-23120416, వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 7901002200 ను అందుబాటులోకి తీసుకొచ్చా రు.
సోమవారం మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 130 ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, అడ్మిషన్స్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులు సందేహాలను నివృత్తి చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ వివరించారు. ప్రతి విద్యార్థి అడ్మిషన్లు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.