calender_icon.png 6 May, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమణ

06-05-2025 12:26:38 AM

వర్షం కారణంగా ఢిల్లీతో మ్యాచ్ రద్దు

హైదరాబాద్, మే 5: ఐపీఎల్ 18వ సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. సోమవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది.  దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్టబ్స్ (41), అశుతోశ్ శర్మ (41) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే రెండో ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు ప్రారంభమైన వరుణుడు ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దుకే అంపైర్లు మొగ్గుచూపారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో ముంబైతో గుజరాత్ తలపడనుంది.