23-05-2025 01:34:55 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు
హనుమకొండ, మే 22 (విజయక్రాంతి): వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే నాగరాజు గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56 వ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ నాలా పోచమ్మ గుడి ప్రాంతం, గోపాల్ పూర్ చెరువు తో పాటు 55 వ డివిజన్ పరిధిలోని నక్షత్ర కాలనీ ప్రాంతాల్లో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ల తో కలిసి క్షేత్ర స్థాయిలో నాలా ల్లో చేపట్టనున్న పూడికతీత ప్రక్రియను పరిశీలించినారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ పరిధిలోని నాలాలలో పూడిక తొలగింపు ప్రక్రియ చేపట్టి వేగవంతంగా పూర్తిచేయాలని జవహర్ నగర్ పోచమ్మ గుడి ప్రాంతంలో గల నాలాపై భాగం లో ఫుట్ ఓవర్ బ్రీడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. గోపాల్ పూర్ చెరువు ప్రాంతం లో పర్యటించిన క్రమం లో ఆ ప్రాంతం లో జంగిల్ క్లియరెన్స్ చేసి చెట్లు నాటాలన్నారు. హైడ్రా తరహాలో నగరం లో వాడ్రా రానుందని తదుపరి ఎఫ్ టి ఎల్ జోన్ లోని ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
55 వ డివిజన్ నక్షత్ర కాలనీ లో పర్యటించే క్రమం లో స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ల దృష్టికి తీసుకురాగా స్పందించిన ఇరువురు కాలనీ వాసులు ఐక్యంగా ఉండాలని వీరి కోరిక మేరకు ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తిస్తారని కార్పొరేషన్ నిధులతో డ్రైనేజీ ఏర్పాటు కు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, 55, 56 డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు, గడ్డం శివరాం ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు చింత రమేష్ గౌడ్, దూలం సదానందం గౌడ్, రుద్రోజ్ మణింద్రనాథ్, విజయ నాయక్, లావుడియా రవి నాయక్, శనిగరపు అనిత, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.