calender_icon.png 23 May, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ కమిటీ ముసుగులో దందా

22-05-2025 11:49:00 PM

  1. సర్వే నెంబర్ 332లో ప్రభుత్వ స్థలం కబ్జా
  2. యథేచ్ఛగా షెటర్స్ వేసి అద్దెలకిస్తున్న వైనం
  3. ఇల్లీగల్ దందాలకు చెక్ పెట్టడంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు విఫలం

కుత్బుల్లాపూర్, మే 22 (విజయ క్రాంతి): ఆలయ కమిటీ ముసుగులో స్థానికులు చేస్తున్న దందా నిజాంపేట్ లో ప్రస్తుతం హా ట్ టాఫిక్ గా మారింది. దేవుడి కోసమేనం టూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన నేతలు.. ప్రస్తుతం గుడి, గుడి లోని లింగాన్ని మింగే మాదిరిగా తయారయ్యారు.

నిజాంపేట్ సర్వే నెంబర్ 332 లో విలువైన ప్రభుత్వ స్థలం శ్రీ మల్లిఖార్జున, భ్రమరాంభిక దేవి, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయం కోసం గతంలో తమకు తామే రెవెన్యూ యంత్రాంగంకు ఏ మాత్రం సంబంధం లేకుండా కేటా యించుకున్నారు. బాచుపల్లి మండలం లోని నిజాంపేట్ సర్వే నెంబర్ 332 లో గల ఈ స్థలం సుమారు రెండు ఎకరాలు వరకు ఉం టుంది. ఈ స్థలం విలువ ప్రస్తుతం వందల కోట్లు పలుకుతుంది.

ఇంత ఖరీదైన ప్రభుత్వ స్థలం కేవలం దేవుడికే అంటే ఎట్లా? నాయకుల జేబులోకీ కూడా వెళ్ళాలి కదా అనుకున్నారేమో ఇక్కడి పలుకుబడి ఉన్న నాయకులు.. అన్ని పార్టీల నాయకులు ఏక మై ’ తలా పాపం తిలా పిడకెడు ’ అనేలా గెట్లు వేసుకుని మరీ పంచుకున్నారు. ఆల య ప్రహరీని ఆనుకుని ఉన్న ప్రధాన రోడ్డు పై ఉండే స్థలాలను తమ అధీనంలోకి తీసుకుని ధర్జాగా షెటర్స్ వేస్తూ లక్షలు రూపా యలు అప్పనంగా అర్జీస్తున్నారు.

దేవుడి గుడికే శఠగోపం పెట్టేలా ఇక్కడి పాలకవర్గం చేస్తున్న తీరుతో ఆలయానికి వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేక, పార్కింగ్ వసతులు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా, రెవి న్యూ ఎన్‌ఓసీలు లేకుండా ప్రభుత్వ స్థలంలో భారీ షెటర్స్ నిర్మించి ప్రతి నెల వేల రూపాయలకు అద్దెలకు ఇస్తూ ప్రభుత్వ ఆస్తులను, దేవుడి మాన్యాలను దోచుకుంటున్నారు.

గిర్దావర్‌కి చెప్పాను.. 

చర్యలు తీసుకుంటా: బాచుపల్లి తహసీల్దార్ పూల్‌సింగ్ 

నిజాంపేట్ సర్వే నెంబర్ 332 లో అక్రమంగా వెలసిన షెటర్స్ విషయం పై బాచుపల్లి తహసీల్దార్ ను వివరణ కోరగా.. తాను కోర్టు పనిమీద బయటికీ వచ్చానని, ఆర్‌ఐ కీ చెప్పాను..  తప్పకుండ అక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను విచారించి కూల్చివేస్తామని తెలిపారు.

జేసీబీ దొరకలేదు.. 

ఇల్లీగల్ షెటర్స్ కూల్చేస్తాం : రెవెన్యూ ఇన్స్పెక్టర్ భానుచందర్

సర్వే నెంబర్ 332 లో జరిగిన అక్రమ షెటర్స్ విషయం పై ఆర్ ఐ భానుచందర్ ను సంప్రదించగా తనకు జ్వరం వచ్చిందని, తాను రెవెన్యూ స్టాఫ్ అందరికి వడదెబ్బ తగిలింది అన్నారు. సోమవారం జేసిబీ సహా యంతో తప్పకుండ అక్రమ షెటర్స్‌పై చర్య లు తీసుకుంటామని తెలిపారు.