22-05-2025 11:53:29 PM
వచ్చిన సిబ్బందికి మెమోలు జారీ..
అందుబాటులో లేకపోతే చర్యలు తప్పవు..
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల హెచ్చరిక..
హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) గురువారం బీఆర్కే భవన్‌లోని మార్కెటింగ్‌శాఖ ప్రధాన కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి ఆలస్యంగా హాజరైన అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి వెంటనే మెమో ఇచ్చి, సంజాయిషీ తీసుకోవాల్సిందిగా మార్కెంటింగ్ శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఆలస్యంగా వచ్చిన 53 మంది రెగ్యులర్ సిబ్బందిలో 16 మంది ఆలస్యంగా హాజరయ్యారని, 42 ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో 5గురు మాత్రమే ఆలస్యంగా హాజరయ్యారని, వారికి మెమో జారీచేశామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఆఫీస్‌లో ఫేస్ రికగ్నైజేషన్‌తో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ఆలస్యంగా వచ్చే అధికారులు, అందుబాటులో లేని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు సిబ్బంది హాజరు పట్టికను తమ ఆఫీసుకు పంపించాలని మంత్రి ఆదేశించారు.