22-05-2025 11:52:00 PM
నిజామాబాద్ మే 22 (విజయ క్రాంతి) : అధికార దర్పంతో పెట్రోల్ పోతున్న కొందరు పోలీసులు అయితే అక్రమ మార్గంలో సంపాదించే అక్రమార్కులతో చట్టపట్టాలేస్తూ మామూళ్లతో బాధ్యతలను విస్మరించి అక్రమార్కులతో అంట తాగుతున్న పోలీసులు మరికొందరు. సివిల్ పంచాయతీలో సైతం జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్లకు పాల్పడుతూ ఉన్న పోలీసు శాఖ లోని కొందరు అవినీతి పోలీసు సిబ్బందితో పోలీసు శాఖకు నిజాయితీగా పని చేసే పోలీసు అధికారులకు అవినీతి మచ్చ పడుతోంది.
పోలీస్ శాఖలో కొందరు సిఐలు ఎస్త్స్రలు సిబ్బంది కేసుల పరిష్కారంలో నిబద్ధత పనిచేస్తూ ప్రతిభ కనబరిచిన పోలీసులకు రాష్ట్ర జిల్లా స్థాయిలో అవార్డులు పొందగా మరికొందరు అధికారులు మాత్రం పోలీసు శాఖకు మాయని మచ్చగా మారుతున్నారు. విధి నిర్వహణలో బాధ్యతలను విస్మరిస్తూ న్నారు. బాధ్యతారహిత అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పోలీసుల వల్ల మొత్తం పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తోంది పైగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతూ ఆయా పోలీసు స్టేషన్లకే అవినీతి మచ్చలు అంటగడుతున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన అధికారులు చాలామంది ఉన్నారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో వరుసగా అవినీతి ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ చిక్కిన అధికారులు ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నగరంలోని పలు వ్యాపారుల వద్ద నుండి పెద్ద ఎత్తున వసూళ్లు చేయించాడని మొరం ఇసుక తరలించే వాహనాలను ఇస్తారాజ్యంగా టౌన్ లోకి అనుమతించి డబ్బులు దండుకోవడంపై ఫిర్యాదులు జిల్లా పోలీస్ బాస్ కు అందాయి.
తాజాగా ట్రాఫిక్ విభాగంలో ఓ అంశంలో మహిళా కానిస్టేబుల్ సైతం ఏసిపి తీరుపై పోలీస్ బాస్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం దీనిపై విచారణ జరిపి నా స్పెషల్ బ్రాంచ్ విభాగం అధికారులు నిజామాబాద్ నగర సిపి సాయి చైతన్యకి నివేదిక అందించారు అనంతరం తదుపరి చర్యలకు డీఐజీ కార్యాలయానికి నివేదిక పంపిన వెనువెంటనే.... ఉన్నఫలంగా ఏసీపీ నారాయణను విధుల నుండి తప్పించి డీజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి కోర్టు పిసి ద్వారా బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో పోలీసు అధికారులు తరచూ అవినీతి నిరోధక శాఖకు చిక్కుతూ ఉండడం గమనార్హ్రం. లింగంపేట ఎస్త్స్ర సుధాకర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తనిఖీలు చేశారు.
తాడ్వాయి ఎస్త్స్ర రామారెడ్డి సస్పెండ్ అయ్యారు. స్టేషన్ బెయిలు సివిల్ తగాదాలు సెటిల్మెంట్ల కు పాల్పడి పోలీస్ శాఖకు అవినీతి మచ్చలు అంట కడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజలను అధిక వడ్డీలతో వేధింపులకు గురి చేస్తూ వారి ఇల్లు ఆస్తులు తమ అధీనంలోకి తెచ్చుకుంటూ పరువు గల వారి నీ బజారుకు ఏడుస్తూ. ప్రజలను జలగల్లా పట్టిపీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఉక్కు పాదం మోపుతున్నారు.
ఇటీవలే అధిక వడ్డీలకు పాల్పడి ప్రజల రక్తం తాగుతున్న వడ్డీ వ్యాపారులను కటకటాల పాలు చేసి డాక్యుమెంట్లను జప్తు చేసి నగదును కూడా సీజ్ చేశారు. పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ వడ్డీ వ్యాపారిగా అవతారం ఎత్తి అమాయకుల ఆదుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చి అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతూ యదేచ్చగా తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టి ల వ్యాపారం నిర్వహిస్తూ చెల్లించని వారి ఆస్తులను తన పేరు ఇస్తా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు
సదరు కానిస్టేబుల్ వేధింపులు తాగలేక బాధితులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదున్న అందుకున్న రూరల్ పోలీసులు వడ్డీ వ్యాపారి అవతారం ఎత్తిన సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఒక మహిళ తన కూతురు అనారోగ్యంతో చికిత్స కోసం డబ్బులు అవసరం ఉండగా మెండోరా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కానిస్టేబుల్ కల్వరి గంగాధర్ కు సమాచారం అందడంతో మహిళ వద్దకు వెళ్లి ఆస్తి తాలూకు దస్తావేజులు ఉంటే డబ్బులు ఇస్తానని నమ్మించాడు.
దిక్కుతోచని స్థితిలో కూతురు చికిత్స కు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న మహిళ వెనక ముందు చూడకుండా అంగీకరించి తనకు చెందిన 20 లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్లు కానిస్టేబుల్ పేరా సేల్ డిడి రాసి ఇచ్చింది ఆ మేరకు సదర్ కానిస్టేబుల్ ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి 5% శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిబంధన పెట్టాడు. తీసుకున్న డబ్బుల తలుకు వడ్డీ వడ్డీ చెల్లించడం లేదని డబ్బుల పశువుల కోసం పెట్టుకున్న ఇద్దరు మనుషులను మహిళా ఇంటికి సదరు హెడ్ కానిస్టేబుల్ పంపాడు.
పంపింది పోలీసు శాఖ ఉద్యోగి కాబట్టి రెచ్చిపోయిన వసూలు కు వచ్చిన వ్యక్తులు నానాహంగామ చేయడంతో సదరు మహిళ నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గంగాధర పై ఫిర్యాదు చేసింది. ఈ పలు ఆరోపణల దృష్ట్యా గత నెల పలువురు ఎస్‌ఐలు హెడ్ కానిస్టేబుల్ లను జిల్లా సిపి సాయి చైతన్య బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కమీషనరేట్ పరిధిలోని 26 మంది హెడ్ కానిస్టేబుళ్లను సిపి సాయి చైతన్య ట్రాన్స్ఫర్ చేస్తూ నాలుగేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలిగించారు ట్రాన్స్ఫర్ అయిన హెడ్ కానిస్టేబుల్ లను సంబంధిత అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని సిపి సాయి చైతన్య ఆదేశించారు. ముక్కు సూటిగా వ్యవహరిస్తున్న నూతన పోలీస్ శాఖ కమిషనర్ సిపి సాయి చైతన్య శైలిలో అవినీతి అధికారుల బరతం పట్టడం మొదలుపెట్టారు.
కఠినంగా వ్యవహరిస్తాం
విధి నిర్వహణలో ఆలసత్యం పోలీస్ స్టేషన్లకు వచ్చే వారి పట్ల దురుసు ప్రవర్తన. భూ తగాదాల్లో తల దూర్చడం. అవినీతి ఆరోపణలు అంటగట్టుకునే వారిపట్ల అక్రమ అరకులతో అంటగాగే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పోలీస్ స్టేషన్లో పైరవీకారులకు ఎటువంటి తావు లేదు అలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు చేపట్టి శాఖపరమైన విచారణ జరిపి కఠినంగా వ్యవహరిస్తాం. శాంతి భద్రతాలు కాపాడే విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాల విషయంలో ప్రజల అప్రమత్తంగా వ్యవహరించ తో పాటు పోలీసులకు సహకరించాలి
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య