calender_icon.png 1 August, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీదేళ్ల గ్రంధాలయ నిర్మాణానికి డాక్టర్ నలబోలు వెంకట్ రెడ్డి దంపతుల చేయూత

31-07-2025 10:55:47 PM

పెన్ పహాడ్: కార్గిల్ లాన్స్ నాయక్ పోలోజు గోపయ్య చారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయ నిర్మాణ ఏర్పాటుకు తన వంతుగా ఆర్ధిక సహాయం అందించి ఓ దంపతులు దాత్రుత్వం చాటుకున్నారు. మండలంలోని చీదేళ్లకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్. నలబోలు వెంకటరెడ్డి- సుజాత దంపతులు తమ వంతుగా గ్రంధాలయ నిర్మాణానికి రూ.50 వేలు ను ట్రస్ట్ సభ్యులు కొండమీది శీను, పోలోజు సత్యనారాయణ చారి (ఎంపీడీవో)లకు అందించారు. గ్రంధాలయ నిర్మాణ ఏర్పాటుకే కాదు గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన తన వంతుగా ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామ ప్రజలు, పలువురు  అభినందిస్తున్నారు.