31-07-2025 10:59:39 PM
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి
తహసిల్దార్ ముప్పు కృష్ణ
నల్లబెల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని నల్లబెల్లి మండల తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఎంపిడిఓ గుండా నరసింహమూర్తికి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ... పదవి విరమణ పొందేది ఉద్యోగానికి మాత్రమే సేవకు కాదన్నారు.
జీవితాంతం పేదలకు సేవలందించాలన్నారు. అనంతరం ఎంపిడిఓ నరసింహమూర్తి మాట్లాడుతూ... నేను ఇంతటి స్థాయికి రావడానికి ఇంత మంచి పేరు రావడానికి తల్లిదండ్రులని పేర్కొన్నారు. వాళ్లు కష్టపడి చదివిస్తే చదివి ఉద్యోగం సంపాదించానని పనిచేస్తున్న కాలంలో కర్తవ్య నిర్వహణలో పారదర్శకంగా ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తిస్తే వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవోదంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ పొందేది ఉద్యోగానికి మాత్రమే సేవకు కాదన్నారు. జీవితాంతం పేదలకు సెవలందించాలన్నారు.