28-07-2025 01:12:46 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ సంస్థ ఆక్యుప్రెషర్ రత్న, డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డులతో పలువురిని ఘనంగా సత్కరించింది. శనివారం రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో గోషామహల్ ప్రాం తానికి చెందిన డాక్టర్ వెంకటేశ్‌గౌడ్‌ను ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ దినేశ్‌చౌదరి అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ తనకు ఆక్యుప్రెషర్, డాక్టర్ ఆన్ సైన్స్ అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశా రు. ఆరు నెలల్లో 200 మంది రోగులకు ఫిజి యో థెరఫీ, ఆల్టర్నేటివ్ థెరఫీల ద్వారా త్వ రగా కోలుకునేలా సేవలు అందించినందుకు రాజస్థాన్ ప్రభుత్వంలో గుర్తింపు పొందిన ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ వారు ఈ అవార్డులు అందించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, పలువురు ప్రముఖులు డాక్టర్ వెంకటేశ్‌గౌడ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.