calender_icon.png 16 August, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో కౌశిక్‌రెడ్డి ఒక చెంచా

28-07-2025 01:13:09 AM

- సీఎంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు 

- ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో ఎన్నో చెంచాలు ఉన్నాయని, అందులో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కూడా ఒక చెంచా అని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మె ట్టు సాయికుమార్ విమర్శించారు. కౌశిక్‌రెడ్డి ఇప్పటికైనా తన కథలు తగ్గించుకో కపోతే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

ఆదివారం ఆ యన గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడే స్థాయి కౌశిక్‌రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్‌లో కౌశిక్‌రెడ్డి ఎందుకు పనికిరాడనే అప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదని, అందుకే బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని తెలిపారు. సారు.. కారు.. పదహారు అని సారు పరారయ్యారని ఎద్దే వా చేశారు రేవంత్‌రెడ్డిపై అనవసరంగా మా ట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, పక్క రాష్ట్రం నుంచి రౌడీలను తె చ్చుకున్నా వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.