28-07-2025 01:11:48 AM
- ట్రంప్ వ్యాఖ్యలకు విశ్వసనీయత లేదు
- కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం సరికాదు
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్‌పై మోదీ ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ అన్నారు. ఏమాత్రం విశ్వ సనీయత లేని ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించడం విచారకరమన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ లేవనెత్తిన చర్చను స్వాగతిస్తున్నామని ఆయ న అన్నారు.
దేశ పరిరక్షణ అందరి బాధ్యత అని, స్పష్టత కోరుకోవడంలో తప్పు లేనప్పటికీ పార్లమెంట్‌కు అంతరాయం లేకుండా జరిగేందుకు సహకరించాలని సూచించారు. ఆదివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న చొరవను ప్రతిపక్ష నేతగా వాజ్‌పాయ్ ప్రశంసించిన తీరును ఇప్పటి కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
మోదీ నేతృత్వంలో మన దేశం మూడుసార్లు పాకిస్తాన్‌పై విజయవంతంగా దాడులు నిర్వహించి, మన వైఖరిని స్పష్టం చేసినప్పటికి కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేయ డం దుర్మార్గమన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన చర్చలో కాంగ్రెస్ పార్టీ నిజాలను స్వీకరిస్తుందా లేదా దేశ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందా అనేది ప్రజలు గమనిస్తారని ఆయన పేర్కొన్నారు.