22-09-2025 01:04:52 AM
కరీంనగర్, సెప్టెంబరు 21 (విజయ క్రాంతి): జీఎస్‌టీ సంస్కరణలవల్ల ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దక్షిణాది వ్యక్తేనని, నిజంగా జీఎస్‌టీ సంస్కరణలవల్ల ఏదైనా సమస్య ఉంటే ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్ఫూర్తి అని బండి సంజయ్ తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ లో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, స్థానిక బీజేపీ నేతల తో కలిసి ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అ ర్పించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజ య్ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మండిపడ్డారు.
నిజంగా జీఎస్టీ సంస్కరణలతో ఏదై నా సమస్య ఉంటే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బా పూజీ అని కొనియాడారు. చేనేత, చేతి వృ త్తుల కార్మికుల కంచంలో అన్నం మెతుకుగా మారిన మానవతావాది అని పేర్కొన్నారు. తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు,
బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే లక్ష్యాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బండి సంజయ్ వివరించారు.మనం చేసే మంచి మాత్రం నిత్యనూతనంగా ఎప్పటికీ బతికి ఉంటుందని, పది మందికి స్ఫూర్తినిస్తుందని, ఆ స్పూర్తే మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆ మహనీయుడు చేసిన త్యాగాలను, నిజాయితీని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.