calender_icon.png 24 July, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

23-07-2025 07:21:34 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): అక్రమంగా ఎండు గంజాయి రవాణా చేస్తున్న ఏడుగరు వ్యక్తులను అరెస్ట్ చేసి 12 లక్షల రూపాయల విలువైన 25 కిలోల ఎండు గంజాయి, ఒక ఆటో,  ఎర్టీగా కారును మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొర్రూరు సిఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఉదయం 5.30 గంటల సమయములో ధూర్గాభవాని తండా క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటో, ఎర్టీగా కారు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిలో తనిఖీ చేయగా ఆటోలో నాలుగు కేజీల బరువున్న 2 రెండు గంజాయి ప్యాకెట్లు, ఎర్టీగా కారులో 21 కేజీల బరువున్న 10 ఇందు గంజాయి ప్యాకెట్టు లభించాయని చెప్పారు. వాహనాల ఆధారంగా విచారణ చేపట్టగా మేకపోతుల వేణుగోపాల్ రెడ్డి,  ఉప్పుగండ్ల ప్రభాకర్, భారీ రాజబాబు, దీపక్ పటేల్, రోహిత్ కుమార్ జస్వాల్, రంకిరెడ్డి వెంకటస్వామి, రామ్ లాల్ రాజస్థాన్ జైలులో ఒకరినొకరు పరిచయం ఏర్పడి అక్రమమైన మార్గంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒడిస్సా నుండి హైదరాబాదుకు ఎండు  గంజా తీసుకొని వెళ్తుంటే నెల్లుకుదురు మండలం దుర్గాభవాని తండా క్రాస్ వద్ద వాహనాలను తనిఖీలో పట్టుబడ్డట్టు చెప్పారు.