23-07-2025 07:20:23 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాకి స్పోర్ట్స్ స్కూల్ & క్రికెట్ స్టేడియం మంజూరు చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయష్ రంజన్ ఐఏఎస్(Special Chief Secretary Jayesh Ranjan IAS)ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం స్పెషల్ చీప్ సెక్రెటరీ జయష్ రంజన్ ఐఏఎస్ సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే స్పోర్ట్స్ స్కూల్ అండ్ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.