7 April, 2026 | 2:19 AM

చలివేంద్రం ప్రారంభం

07-04-2026 12:00 AM

బెజ్జూర్, ఏప్రిల్ ౬ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ సమీపంలో బెజ్జూర్ మాజీ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా, తెలంగాణ జావిద్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సోమవారం తహసీల్దార్ రామ్మోహన్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ.. నిత్యం పరిశుభ్రమైన చల్లటి మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటా మని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బషరత్‌ఖాన్, అమీరుద్దీన్, దుర్గం తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.