7 April, 2026 | 2:20 AM

ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సేవలందించాలి

07-04-2026 12:00 AM

బైంసా, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): పట్టణ ప్రజలకు అవసరమైన సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అన్నారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో పారిశుధ్యం, ఇంటింటికి శుద్ధమైన తాగునీటి సరఫరా, ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలన్నారు. ఇంకా ఆయా విభాగాలకు పలు సూచనలు, సలహాలు చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వై నవీన్, డీఈఈ సంతోష్, ఉద్యోగులు ఉన్నారు.