17-07-2025 01:22:04 AM
భీమదేవరపల్లి ,జూలై 16 (విజయ క్రాంతి): మానసిక సమస్యలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో డాక్టర్ ప్రహసిత్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మానసిక సమస్యలు అయినటువంటి జ్ఞాపకశక్తి లోపం ,పరీక్షల భయము, ఆత్మహత్య ఆలోచనలు, ఒత్తిడి ఆందోళన, ఒంటరిగా అనిపించడం, అలాగే విద్యార్థులకు లైఫ్ స్కిల్స్, గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ లపై వివరించారు .
అలాగే మాదకద్రవ్యాలు అయినటువంటి గంజాయి,కొకైను, పొగాకు సంబంధించిన చుట్ట బీడీ సిగరెటు ఉపయోగించడం వలన కలిగే నష్టాలు వివరించడం జరిగింది.విద్యార్థులు ఎవరైనా ఎలాంటి మానసిక సమస్యలు, చెడు వ్యసనాలకు బానిసలైన, వాటి నుండి విముక్తి పొందడానికి టేలిమానస్ 14416 కి కాల్ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ భాగ్యలక్ష్మ మాట్లాడుతూ జీవితంలో మంచి స్థాయికి రావాలని ఆలోచన ఉంటే ఏలాంటి చెడు వ్యసనాలు, మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అని ఉన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జరిగే సమస్యల పై వివరించడం జరిగింది అలాగే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా ఉండాలని సూచించారు.
విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంగరలో సంప్రదించగలరన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ టీచర్స్, సోషల్ వర్కర్ నరేష్ ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.