calender_icon.png 19 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చకు రమ్మన్నారు.. వస్తే పారిపోయారు

17-07-2025 01:21:33 AM

- ఈసారి మేడిగడ్డ బరాజ్ వద్దేకే రండి  

- సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

- గత ప్రభుత్వంలో ఎంపికైన వారికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): కాళేశ్వరంపై చర్చకు పలిచి, తీరా తాము రాగానే సీఎం రేవంత్‌రెడ్డి పారిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దే వా చేశారు. ‘కూలిందంటున్న మేడిగడ్డ బరా జ్ మీదే చర్చ పెడదాం, దమ్మంటే రేవంత్ మేం విసిరిన సవాల్‌ను స్వీకరించాలి’ అని పేర్కొన్నారు.

బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటికే తమ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి వచ్చి మరి సవాల్ విసిరారని కేటీఆర్ చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్‌రెడ్డి లాంటి దొంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని, అందుకే ఐదేండ్ల పాటు పదవిలో ఉండేలా రాజ్యాంగం రాశారని, లే కుంటే రేవంత్ లాంటి మోసాగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను దేశంలో కూడా ప్రవేశపెట్టేవారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు లబ్ధిదారులకు కావాలనే నిధులు అందకుండా ఆపివేస్తుందని దళితబంధు సాధన సమితి సభ్యులు కేటీఆర్‌ను తమ బాధ లను విన్నవించుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభు త్వం ఎంపిక చేసిన ప్రతి దళిత బిడ్డకు బంధు వెంటనే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దళితబంధుపై పెట్టిన ఫ్రీజింగ్‌ను వెంటనే తొలగించి, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా రూ.12 లక్షలు ఇవ్వాలని కోరారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పార్టీ తరఫున లేఖ రాయనున్నట్టు రాష్ర్ట ప్రభుత్వం ఎ న్ని కేసులు పెట్టినా, ఎన్ని అణిచివేత చర్యల కు పాల్పడినా, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక మోసపూరిత విధానాలను ఎండగట్టడాన్ని మా త్రం ఆపబోమని కేటీఆర్ తెలిపారు. సాగునీరు లేక పల్లెలు, తాగునీరు లేక పట్నాల గొంతెడుందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కృష్ణా, గోదావరి నదుల నిండా నీళ్లు పారుతున్నా, వాటి ని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టిందన్నారు. కాళేశ్వరం గేట్లు తెరిచిపెట్టారని, పాలమూరు పనులు పడావుపెట్టారని మండిపడ్డారు. వెలవెలబోతున్న రిజ ర్వాయర్లు, చెరువులు, కుంటలు, అడుగంటుతున్న బోర్లు, పడావుపడ్డ పొలాలు కాంగ్రెస్ వైఫల్య పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.