calender_icon.png 24 May, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భ్రూణ హత్యలు నివారించాలి..

24-05-2025 06:21:19 PM

జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): భ్రూణ హత్యల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్(District Medical Officer Dr. Ravi Rathod) అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్(District Level Coordination Committee Meeting), మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ, పి.సి. పి.ఎన్.డి.టి ఆక్ట్ లపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉందని, అబార్షన్స్ రేట్ ఎక్కువగా ఉందని, ఎక్కడైతే ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్య సిబ్బంది ఎక్కడైనా ఏ హాస్పిటల్లో నైనా అబార్షన్స్ జరిగితే వెంటనే చెప్పాలని, ఎంటిపి ఆక్ట్ ప్రకారం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు డాక్టర్ జగదీశ్వర్ (పీడియాట్రిషన్), నగేష్ (గవర్నమెంట్ ప్లీడర్), డాక్టర్ మీనాక్షి (గైనకాలజిస్ట్), సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి , ఐసిడిఎస్ సూపర్వైజర్ వాహిణి, కౌన్సిలర్ రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, ఆరోగ్య విద్యా బోధకులు కేవీ రాజు, హెచ్ ఈ ఓ లోక్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, అరుణ్, మనోహర్ ఎల్. డి కంప్యూటర్స్, సిసి అనిల్  కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.