07-11-2025 01:35:10 AM
-పలు కీలక రికారులను ఎత్తుకెళ్లిన దుండగులు
యాదగిరిగుట్ట, నవంబర్ 6(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాల యంలో బుధవారం దొంగతనం జరిగింది. కార్యాలయానికి సంబంధించి పలు కీలక రికార్డులు చోరీకి గురైనట్టు తెలుస్తుంది. రికార్డులను ఎత్తుకెళ్లాల్సిన అవసరం దొంగలకు ఏముంటుంది ఇది ఇంటి దొంగల పనా లేక ఇంకేదైనా అనే అనుమానాలకు దారి తీస్తుంది.
మున్సిపల్‌లో రికార్డులు దొంగతనం జరగడం, పర్మిషన్ ధ్వంసం కావడం దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది పెద్ద ప్రశ్న. ఏదేమైనా పూర్తి వివరాలు బయటకు రావడానికి సమయం పడుతుంది. ఇంటి దొంగల పనా లేక ఇతరుల హస్తం ఉందా అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. పోలీసు ల విచారణలో తెలిసే అవకాశముంది.