calender_icon.png 26 January, 2026 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

26-01-2026 12:05:21 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జనవరి 25 ( విజయక్రాంతి ) : జనవరి 26వ తేదీన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 26వ తేదీన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చే ప్రజలకు సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరేడ్ నిర్వహణ, అతిథుల సీటింగ్, జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిపిఆర్‌ఓ సీతారామ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.