calender_icon.png 15 July, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాల్‌కు జోడీగా దుషారా

15-07-2025 01:06:32 AM

హీరో విశాల్ ఇటీవల ‘మధగజరాజా’ చిత్రంతో అలరించారు. ఇప్పుడు తన 35వ చిత్రాన్ని ప్రారంభించారు. దీన్ని సూపర్‌గుడ్‌ఫిల్మ్స్ పతాకంపై ఆర్‌బీ చైదరి నిర్మిస్తుండగా రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. దుషారా విజయన్ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం చెన్నైలో సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పలువురు సినీప్రముఖు లు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.

చెన్నై లో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్టు చిత్రబృందం ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రానికి  సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్‌కుమార్; సినిమాటో గ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్; ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్; ఆర్ట్: జీ దురైరాజ్.