23-09-2025 12:01:55 AM
ప్రాసెసింగ్ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రాంతీయ రుణాల ప్రాసెసింగ్ కార్యాలయాన్ని వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి ప్రాంతంలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. బీఓ ఐ తెలంగాణ జోనల్ మేనేజర్ ముఖేష్ కు మార్ ముఖ్య అతిథిగా విచ్చేసి బ్యాంకు ప్రాసెసింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రా సెసింగ్ కార్యాలయం ద్వారా వ్యాపార, వ్యవసాయ, గృహ నిర్మాణ, వాహనాలు, విద్య తదితర రుణాలు త్వరితగతిన అందించేందు కు అవకాశం ఉంటుందని తెలిపారు. ము ఖ్యంగా తమ ఖాతాదారులకు, వినియోగదారులకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించేందుకు ఈ బ్రాంచిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ జిల్లాల కు ఈ కార్యాలయం తన సేవలను అందిస్తుందని తెలిపారు.
బీఓఐఓఏ జనరల్ సెక్రటరీ గాలేటి నాగేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రం గ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 120 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని, ఖాతాదారుల సహకారంతో బ్యాంకు మరింత వృద్ధి చెందుతూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ లు కే. మధుకర్ గౌడ్, కే. దీపక్, ఎస్‌ఎస్ చౌహాన్, మేనేజర్‌లు గోపిక్రిష్ణ, జీవన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.