calender_icon.png 27 September, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లై ఓవర్ నిర్మాణానికి దసరా రోజు ముహూర్తం

27-09-2025 01:06:28 AM

దసరా పండగ రోజునే ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి 

మిర్యాలగూడ, సెప్టెంబర్ 26: నార్కెట్ పల్లి - ఆద్దంకి  రహదారి పై పట్టణంలోని నందిపాడు చౌరస్త వద్ద నిర్మించ తలపెట్టిన ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు దసరా రోజు ముహూర్తం ఖరారు అయినట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో  హైవే అధికారులతో కలిసి నిర్మాణ పనుల ప్రతిపాదనలను వివరించగా, అందుకు మంత్రి సమ్మతించినట్లు బీ ఎల్ ఆర్ పేర్కొన్నరు.  విజయదశమి రోజున మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ఫ్లైఓవర్ నిర్మాణ  పనులు ప్రారంభీంచునున్నట్లు తెలిపారు.