27-09-2025 01:06:30 AM
- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హుజురాబాద్,సెప్టెంబర్ 26:(విజయ క్రాంతి)వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయి కృష్ణ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఐలమ్మ స్టాచు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొని, ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి గౌరవించుకుందని అన్నారు. ఏదైనా స్థలంలో పేరు పెట్టాల్సి వస్తే, చాకలి ఐలమ్మ పేరు పెట్టి స్పూర్థిని నింపుతామని అన్నారు. ఆమె పోరాట స్పూర్తిని ప్రజలు నింపుకొని కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొలిపాక సారయ్య, శంకర్, పోచయ్య, శ్రీనివాస్, గోపు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, కొండ్రు నరేష్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాధిక, పిఎసిఎస్ చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, సొల్లు బాబు, సునీత, పుష్పలత, రజక సంఘం మహిళ అధ్యక్షురాలు కొలిపాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రమ, రాధా, భూలక్ష్మి, బాలరాజు, ప్రజాసంఘాల నాయకులు ఈశ్వర్ రె డ్డి, ప్రభాకర్, సదానందం, తదితరులు పాల్గొన్నారు.