calender_icon.png 27 September, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు

27-09-2025 02:16:23 AM

29 నుంచి ఇంజినీరింగ్ కళాశాలలకు..

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు నేటి శనివారం నుంచి దసరా సెలవులిచ్చారు. అక్టోబర్ 6న తిరిగి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇటర్ బోర్డు శుక్ర వారం అధికారిక ప్రకటన విడుదల చే సింది. సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించింది. అదేవిధంగా ఇంజినీరింగ్ కాలేజీలకు ఈనెల 29 నుంచి దసరా సెలవులను ప్రకటించారు. ఇప్పటికే పలు వర్సిటీలు డిగ్రీ కాలేజీలకు సె లవులను ప్రకటించగా, తాజాగా ఇంజినీరిం గ్, ఫార్మసీ కాలేజీలకు 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.