27-09-2025 02:13:06 AM
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
అదిలాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భూమి కోసం.. భుక్తి కోసం... వెట్టి చాకిరి విముక్తి కోసం... పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బోథ్ మండల కేం ద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పిం చారు.
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ మండల కేంద్రంలో గతంలో తాను మాట ఇచ్చిన ప్రకారంగా ధోభీ ఘాట్ నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేశామన్నారు. అందరం ఏకమై చాకలి ఐలమ్మ ఆశయాలను సాదిద్దామని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండ ల కన్వీనర్ నారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ స్వామి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పం సురేందర్, ఎలుక రాజు, సుభాష్, శ్రీధర్ రెడ్డి, రమణ గౌడ్, ప్రశాంత్, ప్రవీణ్, బాపురెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఐలమ్మ: కలెక్టర్, ఎస్పీ
అదిలాబాద్(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐల మ్మ చేసిన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఐలమ్మ 130వ జయంతి సం దర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృది శాఖ ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఉన్న ఐలమ్మ విగ్రహానికి బీసీ సంఘం నాయకులు, అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు శ్యామల దేవి, రాజేశ్వర్, బీసీ శాఖ అధికారి రాజలింగు, బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు తదితరులు పాల్గొన్నారు.
పౌరుషాన్ని, త్యాగాన్ని, పొరాటా పటిమను తెలంగాణ ప్రజల్లో నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం లో ఐలమ్మ చిత్రపటానికి పోలీస్ అధికారు లతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సిహె నాగేందర్, ఇంద్ర వర్ధన్, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్‌లు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం: కుమ్రంభీం అసిఫాబాద్ కలెక్టర్
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి చాకలి ఐల మ్మ చిత్రపటాని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కడతల మల్లయ్య, ప్రతినిధులు రవీందర్, భూమయ్య, సతీష్, మధుకర్, శంకర్, మారుతి, సరస్వతి, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ ఒక స్పూర్తి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, సెప్టెంబర్ 26 (విజయక్రాం తి): తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తమ నాయక్, రజక సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని అన్నారు. గౌడ కులస్తులకు కాటమయ్య రక్షా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం, రజక వృత్తిదారుల సంఘం ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నిర్మల్ (విజయక్రాంతి): చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని జిల్లా స్థానిక అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించా రు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, శ్రీనివాస్, సట్ల నర్సయ్య, శంకర్, సంఘాల నాయకులు పాల్గొన్నారు.