calender_icon.png 20 January, 2026 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 2 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు!

20-09-2024 12:00:00 AM

కాలేజీలకు 6 నుంచి 13వ వరకు హాలీడేస్

15వ తేదీ నుంచి బడులు పునఃప్రారంభం

 హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): దసరా సెలవులు వచ్చేశాయ్. 2024 పాఠశాల విద్యా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. మొత్తం 13 రోజులు సెలవులొచ్చాయి. 15వ తేదీ నుంచి బడులు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయి.

12న దసరా పండుగను జరుపుకోనున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించినట్లు తెలిసింది. ఇక జూనియర్ కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. సెలవులు రాగానే తమ పిల్లలతో తల్లిదండ్రులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.