calender_icon.png 25 May, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ఫామ్ పంటల ద్వారా రైతులకు లబ్ధి

24-05-2025 06:47:13 PM

మనోహరాబాద్/తూప్రాన్ (విజయక్రాంతి): ఆయిల్ పామ్ పంట సాగుతో రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని లివ్ పామ్ కంపెనీ(Liv Palm Company) ఫీల్డ్ ఆఫీసర్ నిశాంత్ అన్నారు. శనివారం మనోహరాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ రైతులు వరి, మొక్క జొన్న, పత్తి పంటల్లో స్వల్ప కాలికంగా ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ దీర్ఘకాలికంగా రైతు ఆదాయం పెరగాలంటే తప్పని సరిగా ఆయిల్ పామ్ సాగుతోనే సాధ్యమన్నారు, ప్రభుత్వం డ్రిప్ కు, మొక్కలకు అధిక మొత్తంలో రాయితీలను ఇవ్వడం వలన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాలని తెలిపారు.

ఆయిల్ పామ్ పంట సాగు చేయడం వలన నాటిన మూడు సంవత్సరాల తరువాత నుండి 35 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం ప్రతి నెలకి పొందవచ్చు, పంట సాగుకు ప్రభుత్వ రాయితీలు అనగా పంట సాగుకు కావాల్సిన డ్రిప్ ఎకరాకి ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ, బిసి, ఓసి వాళ్ళకి 90 % సబ్సిడీ అందించడం జరుగుతుంది. అలానే పంట సాగుకు ఒక ఆయిల్ పామ్ మొక్క కేవలం 20 రూపాయలకు మాత్రమే సబ్సిడీలో పొందవచ్చు, ఏ పంటకు లేనివిధంగా ఈ పంటలో రైతులు ఎకరానికి 4200 రూపాయలు ప్రతీ సంవత్సరం ఉద్యాన శాఖ అంతర పంటల సాగుకు అందిస్తుంది, పంట ఫలసాయం మధ్య దళారీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కంపెనీ వారిచే నేరుగా కొనుగోలు చేసిన తర్వాత 10 రోజుల్లో పేమెంట్ రైతుల ఖాతాలో నేరుగా జమ చేయ బడుతుందని అంతర పంటల ద్వారా ఆదాయం వరి తప్పించి ఏ పంటటైన అంతర పంటగా వేసుకోవచ్చు ఆదాయం పొందవచ్చని  తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ అధికారి స్రవంతి, రైతులు తదితరులు ఉన్నారు.