24-05-2025 06:25:17 PM
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి..
163 కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ..
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండల కార్యాలయంలో శనివారం కళ్యాణ లక్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి(MLC Yadava Reddy) హాజరై 163 చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. వీరితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందని వారన్నారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు, ఎలక్షన్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ నేతలు పల్లెర్ల రవీంద్ర గుప్తా, భగవాన్ రెడ్డి, మామిళ్ళ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు గౌడ్, జింక కృష్ణ, విశ్వరాజ్, సందాని, హైమద్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.