24-05-2025 06:38:53 PM
హుజూర్ నగర్: కమ్యూనిస్టులు లేకపోతే నేటి సమాజంలోని ప్రజలలో మార్పులు ఉండేవి కావని సిపిఐ(CPI) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కామ్రేడ్ నల్ల మల గిరిప్రసాద్ 29వ వర్ధంతిని హుజూర్ నగర్ సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ గిరి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ... దేశంలో అనేక మార్పులకు కారణమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళ కమాండర్ గా పనిచేసిన కామ్రేడ్ గిరి ప్రసాద్ పోరాటాలను కొనియాడారు.
ఆనాటి తరం కమ్యూనిస్టుల ప్రాణాల త్యాగం వలనే ఈనాడు ప్రజలు సమానత్వం, స్వేచ్ఛ అనుభవిస్తున్నారనటంలో సందేహమే లేదన్నారు. ఆనాటి నాయకుల ఆదర్శాల స్ఫూర్తితో ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాదం, ప్రైవేటీకరణ విధానాలపై సిపిఐ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాల ధనుంజయ నాయుడు, పోకల వెంకటేశ్వర్లు, సోమ గాని కృష్ణ, యల్లావుల రమేష్, జక్కుల శ్రీనివాస్, జడ వెంకన్న, మామిడి వెంకయ్య, సుందరి పద్మ, ఉమ పాల్గొన్నారు.