10-08-2025 12:14:03 AM
- తెలంగాణలో 13.. ఏపీలో ఐదు
- 2,520కి తగ్గిన పార్టీల సంఖ్య
న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశంలోని 334 రిజిస్టర్డ్, అన్‌రికగ్నయిజ్డ్ రాజకీయ పార్టీలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈసీ తొలగించిన వాటిలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలున్నాయి.
వీటిలో తెలంగాణ నుంచి 13.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు ఉన్నాయి. ఇందులో జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణి రుద్రమ స్థాపించిన యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా సహా పలు పార్టీలు ఉన్నాయి. గతంలో దేశవ్యాప్తంగా 2,854 పార్టీలుండగా.. తాజాగా 334 పార్టీలను ఈసీ తొలగించడంతో ఆ సంఖ్య 2,520కు చేరింది. 2019 నుంచి ఆరేళ్ల పాటు కనీసం ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయాలనే కనీస నియమాన్ని కూడా ఈ పార్టీలు పాటించలేకపోయామని ఈసీ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలున్నట్టు తెలిపింది.