10-08-2025 12:15:58 AM
- 2024 ఆర్ధిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ 1.5 లక్షల కోట్లు
- డీఆర్‌డీవో, రక్షణ రంగ విభాగాల వల్లే ఈ ఘనత
- కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయంగా రక్షణ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశా రు. 2024 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ. 1,50,590 కోట్లకు చేరిందన్నారు. గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధి కనిపించగా.. ఐదేళ్లలోనే ఈ వృద్ధి 90 శాతానికి చేరిందని స్పష్టం చేశారు.
డీఆర్‌డీవో, రక్షణ రంగ విభాగాలు సహా అన్ని భాగస్వామ్య పక్షాల సమిష్టి కృషి కారణంగా ఈ ఘనత సాధ్యమైందని వెల్లడిం చారు. రక్షణ ఉత్పత్తుల పెరుగుదలపై రాజ్‌నాథ్ శనివారం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టా రు. ‘2024 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ. 1.5 లక్షల కోట్లకు చేరుకొని ఆల్‌టైమ్ రికార్డు సాధించాం.
గతేడాది 1.27 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తు తం 18 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. 2019 రూ. 79వేల కోట్లు విలువైన ఉత్పత్తులు నమోదు కాగా ఇప్పుడది 90 శాతం పెరిగింది. మొత్తం ఉత్పత్తుల్లో డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (డీపీఎస్‌యూ)త పాటు ఇతర పీఎస్‌యూలు 77 శాతం తయారు చేయగా.. మరో 33 శాతం ప్రైవేటు రంగం పాత్ర ఉంది.
రక్షణ పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని మన దేశం తగ్గించుకుంది. ఆత్మనిర్భరత సాధించమనడానికి ఇదొక నిదర్శనం. దేశ అవసరాలను తీర్చడమే కాకుండా రక్షణ ఉత్పత్తులు ఎగుతమని సామర్థ్యం కూడా భారీగా పెరిగింది’ అని వెల్లడించారు.