09-05-2025 01:52:36 AM
రూ. 20 లక్షల విలువైన ప్రత్యేక పరికరాలు అందజేత
ములుగు, మే 8 (విజయక్రాంతి): ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి హైదరాబాదు నగరానికి చెందిన ఈసీఐఎల్ సంస్థ 20 లక్షల రూపాయల వ్యయంతో ఎముకల విభాగానికి ప్రత్యేక పరికరాలను సమకూర్చింది. ఎముకల ఆపరేషన్ కు వినియోగించే సిఆర్మ్ మిషన్, ఓట్ లైట్, ఫ్రాక్చర్ స్టేబుల్ ను జిల్లా కలెక్టర్ దివాకర చేతుల మీదుగా అందజేశారు.
అలాగే భవిష్యత్తులో ఆసుపత్రికి మరిన్ని పరికరాలను అందించి చేయూతగా నిలవాలని కలెక్టర్ ఈసీఐఎల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ ప్రతినిధులు సి.మురళీధర్, సుదాన్ష్ కుమార్, రంజన్ శ్రీ వాస్తవ, ఏటీఎం వేణుబాబు, డి జిఎం రామకృష్ణ, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.