calender_icon.png 23 August, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాకు చేరుకున్న పర్యావరణహిత సంచులు

23-08-2025 01:07:18 AM

-రేషన్ లబ్ధిదారులకు అభయహస్తం పేరిట అందజేత

మంచిర్యాల, ఆగస్టు 22 (విజయక్రాంతి) : జిల్లాలో సెప్టెంబర్ నెల రేషన్ లబ్ధిదారులకు అందించే సన్న బియ్యంతో పాటు అభయహస్తం పేరిట పర్యావరణహిత సంచులు అందజేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఏడు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు ఇప్పటికే సంచులు చేరుకున్నాయి.

మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ కు 81,842 బ్యాగులు రాగా లక్షెట్టిపేటకు 47,165, బెల్లంపల్లికి 35,674, తాండూరుకు 18,065, చెన్నూరుకు 23,364, కోటపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ కు 12,996 బ్యాగులు చేరాయి. మొత్తం ఇప్పటి వరకు 2,19,996 బ్యాగులు చేరుకున్నాయి. వీటిని ఈ నెలాఖరులోగా ఉన్నతాధికారులు కేటాయించిన మేరకు జిల్లాలోని 423 రేషన్ దుకాణాలకు సరఫరా చేయనున్నారు.