23-08-2025 01:08:57 AM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. రమేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఆగస్టు 22(విజయక్రాంతి): రక్తదానం చేయడం బాధ్యతగా తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. రమేష్ తెలిపారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బ్రహ్మ కుమారి ఈశ్వరియ విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో నిర్వహించిన రక్తదాన శిబిర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, జిల్లా వైద్యాధికారి సీతా రాం, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సం దర్బంగా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి మాట్లాడుతూ రక్తదానం మనిషి మాత్రమే చేయగలడని అన్నారు. ఒకరు చేసిన రక్తం ముగ్గురికి ఉపయోగపడుతుందని, ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరికి రక్తం అవసరం పడుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఎవరికివారుగా సంబం ధం లేదన్నట్టు వ్యవహరిస్తే గ్రహీతలకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తం ఇవ్వడానికి అరులేనని తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జి యువరాజ మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు దీనికోసం పేద ప్రజలు నేరుగా లీగల్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వ నూతనంగా మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, దేశవ్యాప్తంగా 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
జిల్లా వైద్యాధికారి సీతారాం మాట్లాడుతూ జిల్లాలో కాగజ్నగర్, ఆసిఫాబాద్‌లలో రెండు బ్లడ్ బ్యాంక్‌లు ఉన్నాయని, జైనూర్‌లో మరొకటి ఏర్పాటు చేయ డానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వైద్య సిబ్బంది, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.