calender_icon.png 26 September, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ

26-09-2025 12:00:00 AM

తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు 

డాక్టర్ నమ్రత బాగోతంపై లోతైన విచారణ

  1. అక్రమ దందాలో జరిగిన లావాదేవీలపై నజర్
  2. భారీ మొత్తాన్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై దృష్టి
  3. బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు

* సరోగసీ పేరుతో ఒక్కో  జంట నుంచి రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు వసూ లు చేసి, ఆ మొత్తాన్ని ఎక్కువగా నగదు రూపంలోనే స్వీకరించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ భారీ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరికి మళ్లించారనే అంశాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే డాక్టర్ నమ్రతతో సహా 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈడీ సోదాలతో మరికొన్ని ఆస్తుల వివరాలు, నకిలీ లావాదేవీల బండారం బయటపడనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): సంతానం కోసం పరితపించే దంపతుల ఆశే పెట్టుబడిగా కోట్ల దందాను నడిపించిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే పోలీసులు, సిట్ బృం దాలు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

బుధవారం హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖపట్నంలోని అనుమానిత ప్రదేశాల్లో ఈడీ అధికారులు ఏకకా లంలో సోదాలు నిర్వహించారు. కొన్ని ఏం డ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. మనీలాండరింగ్, నల్లధనం ఆరోప ణల నేపథ్యంలో ఈడీ ఎంట్రీతో ఈ కేసు తీవ్రత మరింత పెరిగింది.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ అథలూరి నమ్రత ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారిం చింది. ఒక్కో జంట నుంచి సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు వసూలు చేసి, ఆ మొత్తాన్ని ఎక్కువగా నగదు రూపంలోనే స్వీకరించారని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ భారీ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడు లు పెట్టారు, ఎవరికి మళ్లించారనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే డాక్టర్ నమ్రతతో సహా 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈడీ సోదాలతో మరికొన్ని ఆస్తుల వివరాలు, నకిలీ లావాదేవీల బండారం బయటపడనున్నట్లు తెలుస్తోంది.

సిట్ దర్యాప్తులో మరిన్ని నిజాలు..

కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దీన్ని ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించింది. సిట్ దర్యాప్తులో సుమారు 50 కొత్త ఫిర్యాదులు అందగా, 15 కేసులు నమోదయ్యాయి. క్లినిక్ లైసెన్స్ 2021లోనే రద్దయి నా, అక్రమంగా కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. 90 ఏళ్ల సీనియర్ గైనకాలజిస్ట్ సూరి శ్రీమతి పేరును దుర్వినియోగం చేసినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఇది ఒక చిన్న భాగం మాత్రమే, దర్యాప్తు పూర్తయితే మరిన్ని మోసాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.

మోసం జరిగిందిలా..

ఈ చీకటి సామ్రాజ్యం బయటపడటానికి ఒక డీఎన్‌ఏ టెస్టు కారణం. గత ఏడాది జులైలో రాజస్థాన్‌కు చెందిన దంపతులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించి, సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకున్నారు. రూ.35 లక్షలు చెల్లించాక, వారికి ఒక పసికందును అప్పగించారు. అయితే, అనుమా నంతో వారు డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా, ఆ బిడ్డకు, వారికి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

ఈ షాకింగ్ నిజం బయటపడటం తో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయా లు వెలుగులోకి వచ్చాయి. పేద కుటుంబాల నుంచి రూ.90 వేలకు పసికందులను కొని, వారిని సరోగసీ బిడ్డలుగా నమ్మించి, రూ.45 లక్షలకు అమ్ముకుంటున్న ఈ దారుణమైన రాకెట్ బయటపడింది. దాదాపు 15 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఫెర్టిలిటీ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు..

ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్య శాఖ రాష్ర్టవ్యాప్తంగా ఫెర్టిలిటీ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేసింది. సుమారు 50 శాతం కేంద్రాల్లో తప్పుడు రికార్డులు, వైద్య వివరాల తారుమారు వంటి అక్రమాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. సంతానం కోసం పడే ఆరాటం, మోసగాళ్ల పాలిట వరంగా మారకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. సిట్, ఈడీ సంయుక్త దర్యాప్తులో ఈ మోసాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఆర్థిక మూలాలు త్వరలోనే బయటపడతాయని భావిస్తున్నారు.