03-07-2025 12:50:52 AM
సోదరుడి నివాసంలోనూ ఏకకాలంలో తనిఖీలు
కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం!
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 2 (విజయ క్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి, ఉద్యోగం నుంచి సస్పెండైన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు.
ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇంటితో పాటు, ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్ నివాసంలోనూ ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో ఏసీబీ దర్యాప్తులో శివ బాలకృష్ణపై ఆదాయా నికి మించిన ఆస్తులు ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేశారు.
తర్వాత శివబాలకృష్ణను, హెఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ దాన కిశోర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. హెఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన శివబాలకృష్ణ, మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా, అలాగే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఇన్‌చార్జి కార్యదర్శిగా కూడా పనిచేశారు.
400 కోట్ల ఆస్తులు గుర్తింపు
ఏసీబీ దర్యాప్తులో శివబాలకృష్ణ, ఆయన బంధువులు, సన్నిహితుల పేరిట భారీగా అ క్రమాస్తులు రిజిస్టర్ అయినట్లు వెల్లడైంది. మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూము లు, 29 ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఒక విల్లా వంటి ఆ స్తులను అధికారులు గుర్తించారు. వీటిలో జనగామ జిల్లాలో 102 ఎకరాలు, యా దా ద్రి భువనగిరిలో 66 ఎకరాలు, నాగర్‌కర్నూ ల్‌లో 38 ఎకరాలు, సిద్దిపేటలో 7 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 0.5 ఎకరం భూమి ఉన్న ట్లు పేర్కొన్నారు.
ఈ ఆస్తుల మార్కెట్ విలు వ సుమారు రూ.250 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అంచ నా వేసింది. ఈ మొత్తం ఆస్తుల్లో దాదాపు 70 శాతం బాలకృష్ణ సోదరుడు నవీన్‌కుమార్ పేరు మీద బినామీ ఆస్తులుగా రిజిస్టర్ అయినట్లు ఏసీబీ తేల్చింది. అక్రమ ఆస్తుల సముపార్జనలో శివ బాలకృష్ణకు సహకరించిన ముగ్గురు వ్యక్తుల ను ఏసీబీ గతంలోనే అరెస్ట్ చేసింది. ఈ కేసులో హెఎండీఏ, మె ట్రో రైల్ అధికారుల పాత్రపైనా ఈడీ, ఏ సీబీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.