03-07-2025 12:49:56 AM
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ పకడ్బందీగా అమలు
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, జూలై 2 (విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ, ఆపరేషన్ స్త్మ్రల్, ముస్కాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 31 వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి, బాల కార్మిక నిర్మూలనకు చట్టాలను క్షేత్రస్థాయిలో సంబంధిత విభాగాలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్ - 11 పోస్టర్ ను ఆవిష్కరించారు.
చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా చైల్ హెల్ప్ లైన్ నెంబర్స్ 1098 , 112 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోఈ సమావేశంలో పాల్గొన్న సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నాగవాణి, జిల్లా వెల్ఫేర్ అధికారిని శిరీష, డి.ఎస్.పి తిరుపతిరావు, డీఈవో డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ రవి రాథోడ్, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.