calender_icon.png 23 May, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నడ రచయిత్రికి బుకర్ ప్రైజ్

22-05-2025 01:32:49 AM

  1. తన ‘హార్ట్ ల్యాంప్’ కథల సంకలనానికి అందుకున్న బాను ముస్తాక్
  2. ఈ ఘనత సాధించిన తొలి కన్నడ రచయిత్రిగా గుర్తింపు

న్యూఢిల్లీ, మే 21: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌కు వరించింది. తన ‘హార్డ్ ల్యాంప్’ అనే చిన్న కథల సంకలనానికి గానూ ఆమె ఈ అవార్డును గెలచుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా బాను రికార్డు సాధించారు. చిన్న కథల సంకలనానికి బుకర్ ప్రైజ్ అం దడం ఇదే తొలిసారి. దీపాభస్తి రాసిన ‘హసీనా అండ్ అదర్ స్టోరీస్’ అనే పుస్తకాన్ని బాను ముస్తాక్ అనువాదించారు.

లండన్‌లోని టేట్ మోడరన్‌లో జరిగిన ఓ కార్యక్ర మంలో దీపా భస్తితో కలిసి భాను ముస్తాక్ ఈ అవార్డును అందుకున్నారు. ప్రైజ్ కింద 50 వేల పౌండ్ల నగదు బహుమతి లభించగా, దీపాతో కలిసి పంచు కున్నారు. ‘హార్డ్ ల్యాంప్’ అనేది 12 చిన్న కథల పుస్తకం. పితృస్వామ్య సమాజంలో మహిళల రోజువారీ జీవితాల గురించి ఇంందులో వివరించారు. ఇతి తన అందమైన భాషకు అందిన గొప్ప విజయమని బాను పేర్కొన్నారు. 

మహిళా హక్కుల కోసం గళం

కర్ణాటకకు చెందిన బాను ముస్తాక్ రచయిత్రే కాకుండా సామాజిక కార్యకర్త, న్యాయవాది కూడా. ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను, పాఠశాల విద్యను అభ్యసించే సమయంలోనే తొలిసారి ఓ షార్ట్ స్టోరీని రాశారు. అయితే అది ఆమె 26 ఏండ్ల వయసులో పత్రికలో ప్రచురితమైంది. తన తండ్రి ప్రోత్సాహంతో బాను చదువులోనూ రాణించారు.

ఉర్దూలోనే విద్యనభ్య సించిన బాను, కన్నడపై సైతం పట్టు సాధించారు. ఆ తర్వాత రిపోర్టర్‌గా, లాయర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగించారు. బాను ఓ రచయితగానే కాకుండా మహిళల హక్కుల కోసం గళమెత్తారు. బానుమస్తాక్ సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక సాహిత్య అకాడమీ, దాన చింతామణి అతిమబ్బె అవార్డులతో సత్కరించింది.